ప్రియమయిన తాత ;- అంకిత

  తాత   ఏం చేస్తున్నావు
 నువ్వూ  టైం కీ  బోజనం చేస్తున్నావ ని కాళ్ళు  మంచిగ  పనీ చేస్తున్నాయ   మరి మా ఇంటికీ  నువ్వు ఎప్పుడూ వస్తవ్ నేను నీకు ఇప్పుడు మా  బడిలో ఏం చేశామో లేఖ రూపoలో  పంపిస్త... 
మేమూ  మా  బడి లో  నిన్న  మా   మా ఉపాధ్యాయులకు తూవాలాలు   కప్పుతూ  ఫోటోలు కూడా దిగిన ము ఇంకా చాలా ఎంజాయ్ చేసాము నిన్న నాకు చెప్పలేని అంతా ఆనందం కలిగింది... నిన్న అసలే మా బడిని విడిచి వెళ్లలేని అంతా ఆనందం కలిగింది... 
  మాకు బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చారు...
 నిన్న మా బడిలో ఒక అమ్మాయికి కళ్ళు తిరిగి కింద పడిపోయింది...
 ఇంకా అక్కడ  అందరూ బాగున్నారా మా బడిలో ఈరోజు మా సార్లు అందరూ కలిసి ఆంజనేయ చారి సార్ కి  శాలువా కప్పారు ఆంజనేయ చారి సార్ ని మేము చారి సార్ అని పిలుస్తాము....
  చారి సారు ఈరోజు మాకు అరటిపండు ఇచ్చారు ఇంకా మా బడిలో తెలుగు టీచర్ మాకు మంచిగా చెప్పేది ఇంకా మాకు మ్యాథమెటిక్స్ మాస్టర్ కూడా లెక్కలు బాగా చెప్పేవారు ఇంకా మాకు ఇంకా మాకు మ్యాస్  సార్  మ్యాచ్ బాగా చెప్పేవారు ఇంకా సైన్స్ సర్  కూడా చాలా బాగా చెప్పేవారు ఇంకా ఇంగ్లీష్ టీచర్ కూడా మంచిగా చెప్పేది....
 మా బడి పేరు జడ్.పి.హెచ్.ఎస్  నర్మెట  టర్మరిక్ చేతిలో కూడా పాల్గొన్నాడు తమ్ముడికి జరం వచ్చింది.... తమ్ముడు ఇప్పుడు బాగున్నాడు... నీ ఆరోగ్యం మంచిగా ఉంచుకో  నువ్వు మందులు టైం కి వేసుకో మా గురించి నువ్వు బాధపడకు అక్కడ మీరందరూ మంచిగా ఉండాలని నేను ఆ దేవుడిని మొక్కుతున్న మీరు బాగుంటే మాకు సంతోషం నువ్వు అన్నం తిన్నావా నేను మంచిగా ఉన్న.... 
 ఇట్లు
 నీ మనవరాలిని
 పేరు అంకిత
 క్రమ సంఖ్య (1) 
 క్లాస్ సిక్స్త్
 జడ్.పి.హెచ్.ఎస్ నర్మెట్ట స్కూల్
 చిరునామా
 ముక్కెర యాదయ్య. 
 ఊరు సింగారం
 మండల్ రాజాపేట
 జిల్లా యాదాద్రి
కామెంట్‌లు