సుప్రభాత కవిత ; బృంద
గిరులను కప్పేస్తూ
తరులను తడిమేస్తూ
ధరకు దిగివచ్చి...దివిలోని
పరిమళమ్మేదో భువికలదినట్టూ..

జగమును సాంతమూ
పొగవోలే కమ్మేసి
అగరు వేసిన ధూపమై
అవనిని ఆవహిస్తూ...

తొలి సంధ్య  ప్రసవించు
తెలి వెలుగు కిరణాలు
నులివెచ్చగ తాకగనే...
చలికాగు కోరికతో దరిచేరుతూ..

తనను తానే కోల్పోయి
కనకధారలా కురియు
దినకరుడి మయూఖ జాడలో
మౌనముగ కరిగి కలిసిపోతూ..

తెలివెలుగుకు తలుపులు తీసి
మెలమెల్లగ భువికి
మేలుకొలుపులు పాడుతూ
ఇలకు వీడుకోలు పలుకుతూ

మాయమైపోవు పొగమంచులా
మూగి మనసును మురిపించు
ముచ్చటల పోగేసి మురిపముగ
మరలమరల గురుతు సేయు 

వెచ్చని వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు