ముండకోపనిషత్తు;- సి.హెచ్.ప్రతాప్
 ముండక ఉపనిషత్తు లేదా ముండకోపనిషత్తు అత్యంత ప్రాచీన ఉపనిషత్తులలో ఒకటి. ఈ ఉపనిషత్తు అధర్వణ వేదమునకు సంబంధించింది. "ముక్తిత" సూత్రాలననుసరించి ఇది 108 ఉపనిషత్తులలో 5 వ ది. ముండకం' అంటే ఆవిధంగా గొరిగేవ్యక్తి లేదా సాధనం. ముండనం తర్వాత ఒక అగ్ని ఉన్న పాత్రను తలపై పెట్టుకుని గురువు వద్దకు వెళ్ళడం అథర్వణవేదాన్ని నేర్చుకునే విద్యార్థికి విధిగా వుండేది.ఈ ఉపనిషత్తులో మూడు భాగాలు ఉన్నాయి. ప్రతి భాగానికి ముండకం అని పేరు. ఒక్కొక్కముండకంలో రెండు ఖండాలు. అంటే మొత్తం ఆరు ఖండాలు ఇందులో ఉన్నాయి. ఒక్కొక్క ఖండంలో దాదాపు పదిమంత్రాలున్నాయి.ముండనం చేయించుకోవడం ద్వారా, అన్ని కోరికలను పరిత్యజించి, మోక్షప్రాప్తికి ప్రయత్నం ప్రారంభించడం, దీని కొరకు సన్న్యాసాన్ని స్వీకరించడం అనేది సంకేత రూపంలో తెలుప బడింది. అటువంటి మోక్షేచ్చ కలవారికి ఉపదేశాన్ని అందించే ఉపనిషత్తు గనుక ముండకోపనిషత్తు అని పేరు వచ్చింది.
ఈ ఉపనిషత్తులో నాందీ ప్రార్ధన ఈ కింది విధంగా వుంటుంది.
శౌనకుడు అనే జిజ్ఞాసువు అంగిరస మహర్షి వద్దకు వచ్చి "ఏది తెలుసుకుంటే సర్వమూ తెలుసుకున్నట్లవుతుంది?" అని అడిగిన ప్రశ్నకు అంగిరసుడు "పరావిద్య, అపరావిద్య అని రెండు రకాలు తెలుసుకోవలసినవి ఉన్నాయని బ్రహ్మవిదులు అంటారు. పరావిద్య అంటే పరబ్రహ్మకు సంబంధించిన జ్ఞానం. అపరావిద్య అంటే లౌకికమయిన ధర్మాధర్మాలకు సంబంధించినది. రెండవదానికంటే మొదటిది గొప్పది. దాన్ని తెలుసుకున్నవాడు సంసారచక్రం నుంచి విముక్తుడవుతాడు." అంటూ ఈ ఉపనిషత్తును బోధించాడు.గొప్ప ఉపన్యాసాలు ఇవ్వడం చేతగాని., చాలా శాస్త్రాల అధ్యయనం చేయడం వలనగాని, ఎన్నో గూడార్ధలు మహాత్ముల వద్ద వినడం వలన గాని ఆత్మప్రాప్తి జరుగదు. ఆ ఆత్మకోసం హృదయ పూర్వకంగా ఆరాటపడిన వ్యక్తికే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. ఆత్మసాక్షాత్కారాన్ని పొందటానికి ఎవరికైనా కావలసింది, ఉండవలసింది హృదయపూర్వకమైన ఆరాటం. నిన్న మొన్నటి రమణమహర్షి, రామకృష్ణ పరమహంసలు మనకు బాగా తెలిసిన మహనీయులు. వారు వేద, వేదాంగాలను, పురాణేతి హాసాలను చదవలేదు. గంభీర ఉపన్యాసాలను చేయలేదు. కానీ వారికి ఆత్మసాక్షాత్కారమైంది.
ఓం. ఓ భగవంతుడా, మంగళకప్రదమైనవే మేము వినెదము గాక, ఓ పూజ్యమైన దేవతలారా, మంచినే చూచెదముగాక, మా సమస్తాంగములు, దేహము శక్తిమంతమై యుండుగాక, సృష్టికర్తయైన బ్రహ్మ యిచ్చిన జీవితాన్ని ఆనందిస్తూ, నీ కీర్తనలే గానము చేతుముగాక!!!
ఓం శాంతి! శాంతి! శాంతి!  

కామెంట్‌లు