ఒంటి కబుర్లు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
ఓ తారవెలిసింది
గగనాన మెరిసింది

ఓ పువ్వుపూసింది
పరిమళం చల్లింది

ఓ మబ్బులేచింది
చినుకులు కార్చింది

ఓ మొక్కమొలిచింది
మహావృక్షముగ ఎదిగింది

ఓ దీపంవెలిగింది
చీకటిని తరిమింది

ఓ తోడుదొరికింది
జీవితాన అండనిచ్చింది

ఓ అడుగుపడింది
గమ్యాన్ని చేర్చింది

ఓ అందంకనపడింది
ఆనందాన్ని ఇచ్చింది

ఓ ఊహపుట్టింది
జీవితాన్ని మార్చింది

ఓ కవిపుట్టాడు
కవితలు సృష్టించాడు

ఓ కైతచెంతకువచ్చింది
మనసును దోచింది


కామెంట్‌లు