న్యాయాలు -613
ప్రస్తర ప్రహరణ న్యాయము
******
ప్రస్తర అంటే రాయి, రత్నము, చిగురుటాకులు పూలతో కూర్చిన శయ్య.ప్రహరణ అనగా కొట్టుట,విసరుట, తొలగించుట,ఆయుధము, యుద్ధము అనే అర్థాలు ఉన్నాయి.
ప్రస్తర ప్రహరణ మనగా ఱాళ్ళు రువ్వుట అని అర్థము. అనుపయోగములైన చిన్న చిన్న రాళ్ళు కాళ్ళకు తాకడమో,పాదాల తాకిడికి చెల్లాచెదురుగా పడిపోవడమో జరుగుతుంది.అంటే అవి నిరుపయోగంగా ,వ్యర్థంగా ఉండడమే కాకుండా అక్కడక్కడ పారవేసినట్లుగా ఉంటాయి.
అయితే వాటిని చెట్టుకున్న కాయలు రాల్చడానికో, వేటినైనా బెదిరించి, దూరంగా అదిలించడానికో ఉపయోగించు కోవచ్చు. అలా నిరుపయోగంగా ఉన్న వాటిని కూడా ఉపయోగకరంగా మార్చుకోవచ్చు అని అర్థము.
ఇక ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే ఈ సృష్టిలో మన చుట్టూ ఉన్న వాటిల్లో ఏదీ నిరుపయోగం కాదు. ఉపయోగించుకునే తెలివి తేటలు ఉండాలి కానీ రాయీ రప్పా,గడ్డీ గాదం ఏదో ఒక రూపంలో అవసరాలకు ఉపయోగపడతాయని ఇందులోని అంతరార్థం అన్నమాట.
మరి వాటికి కొన్ని ఉదాహరణలు చూద్దాం...గడ్డిపోచల విషయానికె వస్తే వాటిని కాళ్ళకింద నలుగుతుంది.దాని ప్రాణమెంత? బలమెంత అనే అమాయకపు ఆలోచన పక్కకు బెట్టి, వాటిని కలిపి తాడులా పేనితే ఎంత బలంగా తయారవుతుందో మనందరికీ తెలిసిందే. మోపులను కట్టడానికి, పశువులను కట్టేయడానికి ఉపయోగించ వచ్చు. ఇక అందులోనే ఉండే కొన్ని రకాల దర్భలను హిందువులు కర్మకాండల సమయంలోనూ , హోమాలు చేయడంలోనూ ఎంతో పవిత్రమైనవిగా ఉపయోగించడం చూసే వుంటాం.
అలా "కాదేదీ కవిత కనర్హం" అని శ్రీ శ్రీ గారు అన్నట్టు, ఈ లోకంలో కనిపించే ప్రతి వస్తువు ఏదో ఒక అవసరానికి సృష్టించబడినదేనని, అందులో ఎలాంటి సంశయం లేదని ఘంటాపథంగా చెప్పవచ్చు.
ఈ "ప్రస్తర ప్రహరణ న్యాయము" ద్వారా ముఖ్యంగా మనం గ్రహించాల్సిన విషయాలు ఏమిటంటే గడ్డిపోచే కదా అని చులకనగా చూడటమో ,గులక రాళ్ళే కదా అని వ్యర్థమైనవిగా భావించకూడదనేది తెలుసుకోవాలి.
వాడి పడేసే పరికరాలు, వస్తువులతో, వ్యర్థ పదార్థాలతో అద్భుతమైన కళాఖండాలు తయారు చేయడం నేడు మనం చూస్తున్నాం. కొంచెం ఆ దిశగా మనసు పెడితే ఎవరికీ ఈ సృష్టిలో వ్యర్థం, పనికిరానిదంటూ ఏదీ కనబడదు ఇక.మారిన మనో దృష్టి వేటిని ఎలా చేయాలి, ఉపయోగించుకోవాలా అనే ఆలోచనలో పడిపోతుంది ఆచరణకు సమాయత్తం అవుతుంది. మరింకెందుకు ఆలస్యం.ఆ దిశగా అడుగులు వేద్దాం .

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి