బొజ్జ గణపయ్య;-దుడుగు నాగలత-సిద్దిపేట
తియ్యనైనపాయసమును నెయ్యి తోడ
చేసి ,మోదకములునీకు చేసియుంచి
పిండి యుండ్రాళ్ళు,లడ్డులు ప్రియముగాను
నీకు నైవేద్యములుగాను  నేనిడుదును


బొజ్జ గణపయ్య నిరతము పూజలెల్ల
ముందుగానిల్చి యందుకో ముదముతోడ
ప్రీతితోనిను గొల్చెద విఘ్నరాజ
యాపదలనన్ని తొలగించు యాదిదేవ

పసుపుముద్దగా జేసియు, పత్రినుంచి
పూలు,పండ్లతో మంగళ మూర్తినిన్ను
నిండు మదితోడ కొలిచెద మెండుగాను
నాదు నజ్ఞానమునుబాపు యాదిదేవ


కామెంట్‌లు