నా ప్రియమైన నాయినమ్మకు రాయునది. నేను నీ మనుమడిని. నువ్వు నాకు అప్పుడు ఏమి తెచ్చిన కొంగున మూట కట్టుకుని తెచ్చి నాకు యిచ్చేదానివి. నేను అడిగినప్పుడు బుజం మీద ఎత్తుకుని తిప్పినావు. నీకు చేత కాకున్నా వూరంతా తిప్పేదానివి. నువ్వు నీ ప్రాణం కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించినవు. నువ్వు పస్థులుండి నా ఆకలి తీర్చినావు. నేను బడికి తినకుండా వెళ్లి నప్పుడు నువ్వు నడుచుకుంటూ వచ్చి టిఫిన్ ఇచ్చినావు. జ్వరం వచ్చినప్పుడు నాకోసం ఉపవాసం ఉన్నావు. నువ్వు బావి దగ్గరికి వెళ్లినప్పుడు నా కోసం జామకాయలు తెచ్చినావు. నీకు దెబ్బలు తగిలినప్పుడు నేను ఏడ్చినా గుర్తుందా. నేను జాతర లో తప్పి పోయినప్పుడు నువ్వు బాగా ఎక్కి ఎక్కి ఏడ్చినావు. నేను కనబడగానే గుండెలకు హత్తుకున్నావు. నేను పైసలు అడిగినప్పుడు లేవు అనకుండా యిచ్చినావు. కాని నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను. యిప్పుడు నన్ను చూసి ఆనందపడేదానివి. అప్పుడు నువ్వు నాకు చదువు రాదు అని అనేదానివి కదా. నేను యిప్పుడు బాగా చదువుతున్న. నువ్వు అక్కడ ఉండి నన్ను చూస్తున్నావు అనుకుంటున్నా. నువ్వు నా ప్రాణం నేను నీ ప్రాణం అని చెప్పేదానివి. నేను ఎక్కడికి వెళ్ళినా నా వెంటే వచ్చేదానివి. నువ్వు ముసలిదానివయినా నన్ను చూడడానికి వచ్చేదానివి. నువ్వు పనికి వెళ్లి వచ్చిన పైసలతో రోజు నాకు చాక్లెట్ కొని ఇచ్చేదానివి. నువ్వు ఎప్పుడూ నా గురించే ఆలోచించే దానివి. నాకు ఏది కావాలంటే అది కొనిచ్చేదానివి. నేను మంచిగా చదవాలని నీ ఆశ, నీ కోరిక తప్పక నెరవేరుస్తా నానమ్మ.
ఇట్లు
నీమనుమడు స్వరూప్,
10వ, తరగతి,
క్ర.సం.17, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల నర్మెట్ట, జనగామ జిల్లా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి