యుటిఎఫ్ పాటల పోటీల్లో విజేతలు వీరే

మానసిక వికాసానికి సంగీతమనే కళ ఎంతగానో దోహదపడుతుందని రాజాం మండల విద్యాశాఖాధికారి వై.దుర్గారావు అన్నారు. 
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన యుటిఎఫ్ స్వర్ణోత్సవ పాటల పోటీల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి పక్కి వాసు అధ్యక్షత వహించగా. రేగిడి మండల విద్యాశాఖాధికారులు ఎం.వి.ప్రసాదరావు, బి.ఎరకయ్య, సంతకవిటి విద్యాశాఖాధికారిణి బి.శాంతకుమారిలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై ప్రసంగించారు. తొలుత బి.శాంతకుమారి, వై.దుర్గారావు, బి.ఎరకయ్య, ఎస్.సత్యన్నారాయణ, ఎం.భాస్కరరావు, మీగడ మల్లిఖార్జునరావు, కుదమ తిరుమలరావులు అందరినీ ఉత్సాహపర్చుతూ ప్రత్యేక గీతాల్ని ఆలపించారు. అనంతరం నిర్వహించిన పాటల పోటీల్లో పాల్గొన్నవారంతా దేశభక్తి, దైవభక్తి, జానపద, సామాజిక స్పృహ గల పాటలను ఆలపించి అందరి ప్రశంసలు పొందారు. 
పురుషుల విభాగంలో కె.నరసింహమూర్తి ప్రథమ, డి.రామారావు ద్వితీయ, ఎస్.జయకృష్ణ తృతీయ స్థానాలకు ఎంపికై విజేతలుగా నిలిచారు. మహిళల విభాగంలో ఆర్. జ్ఞానసుందరి ప్రథమ, కె.గౌరి ద్వితీయ, టి.లత తృతీయ స్థానాలకు ఎంపికై విజేతలుగా నిలిచారు. న్యాయ నిర్ణేతలుగా శాసపు సత్యనారాయణ, కుదమ తిరుమలరావు, ఆనెం భాస్కరరావులు వ్యవహరించారు. విజేతలుగా నిలిచిన ఈ ఆరుగురినీ జిల్లా స్థాయి పోటీలకు పంపనున్నామని రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు మారెళ్ళ కృష్ణమూర్తిలు తెలిపారు. కార్యక్రమంలో రాజాం మండల శాఖ అధ్యక్షులు మువ్వల రమేష్, ప్రధాన కార్యదర్శి బలివాడ నాగేశ్వరరావు, ఎన్ కిశోర్ కుమార్, బి.రామినాయుడు, చుక్కా వైకుంఠరావు, ఎ.వెంకట అప్పల నాయుడు, గేదెల రమేష్, జె.సన్యాసిరాజు, ఎస్.మల్లేశ్వరరావు, ఎం.ప్రసాద్, వడ్డి ఉషారాణి, బి.వెంకటలక్ష్మి, ఎస్.పద్మ, ఆర్.సీతారామలక్ష్మి, ఎ.లక్ష్మి, ఆర్.గీత, ఎం.సరోజని, కె.గౌరి, కె.ప్రమీలారాణి, పి.శారదాదేవి, జి.శివలక్ష్మి, 
ఎం.శోభారాణి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహిళలకు మ్యూజికల్ చైర్ పోటీలు నిర్వహించారు. ఇందులో వడ్డి ఉషారాణి ప్రథమ, ఎస్.పద్మ ద్వితీయ, ఎం.సరోజిని తృతీయ స్థానాలకు ఎంపికై విజేతలుగా నిలిచారు.
కామెంట్‌లు