అమ్మ వొడినందు కమ్మని మాటలు
నడిచినట్టి దారి నవరసంబు
అక్షరాలమాల కుక్షిన చేరినా
మాతృభాష ఫలము మధురమౌను
బాసలన్ని నేర్చి భాషించు నన్యంబు
మురియునట్టి మనిషి మూర్ఖుడవును
అమ్మభాషయందు యమృతము చిందును
మాతృభాష నెపుడు మరువలదు!
వేషమేదియనక యాసతో పలుకులు
మనసు మమత దోయు మచ్చికైన
మాతృభాష తోడ మమత సమతబెంచు
యెల్లకాలమందు వెలుగు తెలుగు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి