శ్రీరాంపూర్ మండలంలోని ఊషన్నపల్లి ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పిల్లలు శుక్రవారం మట్టి వినాయక విగ్రహాలు వాడాలని నినాదాలు చేస్తూ, గ్రామ వీధుల్లో భారీగా ఊరేగారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో పాఠశాల పిల్లలు, ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు గ్రామ వీధుల్లో ఈ ర్యాలీ నిర్వహించారు. 'మట్టి వినాయక విగ్రహాలు ముద్దు', ప్లాస్టర్ ఆఫ్ పారీస్ విగ్రహాలు వద్దు', మట్టి వినాయక విగ్రహాలు వాడండి, పర్యావరణాన్ని కాపాడండి అంటూ పిల్లలు, ఉపాధ్యాయులు కలిసి నినాదాలు చేస్తూ గ్రామ విధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారుచేసిన వినాయకుని విగ్రహాలు ప్రమాదకరమైన రసాయనాలతో మిలితమై ఉంటాయని, అవి నీటిలో కలవడం వల్ల నీటిలోని జీవరాసులు చనిపోయే అవకాశం ఉందన్నారు. ఇలాంటి ప్రమాదకర రసాయనాల వల్ల నీరు, భూమి కలుషితమై, భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయన్నారు. అనంతరం ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయుల సహకారంతో పిల్లలు అందమైన మట్టి వినాయకుని విగ్రహాలను తయారు చేశారు. మధ్యాహ్నం పూట ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, కొంకటి శ్రీవాణి, పిల్లలు, పలువురు పాల్గొన్నారు.
పిల్లలు ఉన్నత స్థానానికి ఎదిగితే, మొదట సంతోషించేది గురువులేనని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. గురువారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, తొలి మహిళా ఉపాధ్యాయినిరాలు సావిత్రిబాయి పూలేలను స్మరించుకున్నారు. వారి సేవలను కొనియాడారు. పాఠశాల పిల్లలు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు పూలమాలలు వేసి, సన్మానించారు. ఉపాధ్యాయులకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ... పాఠశాల పిల్లల భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని, మట్టిలో నుంచి మాణిక్యాలను తయారు చేసేది, గురువులేనన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల అనుబంధం చాలా గొప్పదన్నారు. తాను కొవ్వొత్తులా కరిగిపోతూ ఇతరులకు వెలుగునిస్తాడని, పిల్లలకు విజ్ఞానాన్ని పంచుతాడని ఆయన అన్నారు. విద్యార్థినీ, విద్యార్థులు ఉన్నత స్థానాల్లో నిలిస్తే మొట్టమొదట సంతోషపడేది గురువులేనని ఈర్ల సమ్మయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు, పిల్లలు, పలువురు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి