నాన్నమ్మకు లేఖ;- మండి. సమ్రీన్
   06-09-2024,
                           నర్మెట్ట
ప్రియమైన నాన్నమ్మకు,
              నాన్నమ్మ ఎలా ఉన్నావు? నేను బాగా ఉన్నాను. టైముకి అన్నం తింటుంన్నావా. టైముకి గోలీలు వేసుకుంటున్నావా .మీ ఆరోగ్యం ఎలా ఉంది.నువ్వు మాకు చాలా ఇచ్చావు కానీ మేము ఏమి ఇవ్వలేకపోయాను.మీరు నాకు చిన్నప్పుడు ఎత్తుకొని పెంచారు.మాకు కంటికి రెప్పలాగా పెంచారు.మేము తెలియక చేసిన తప్పును క్షమించండి .మీరు మాకు చాలా ఆనందం ఇచ్చారు. మాకోసం చిన్నప్పుడు చాలా కష్టపడ్డారు. మా ఆనందం కోసం మీ ఆనందాలు పోగొట్టుకున్నారు. మా అమ్మ కొట్టినప్పుడు నేను ఏడిచే దాన్ని కదా. నానమ్మ అప్పుడు నువ్వు ఓదారిచ్చేదానివి కదా నానమ్మ. నానమ్మ నువ్వు బొమ్మలు కొనిచ్చేదానివి కదా అప్పుడు నేను చాలా ఆనందపడే దాన్ని కదా. నేను స్కూల్ కి పోను అని ఏడిస్తే నువ్వు బిస్కెట్ కొనిచ్చే దానివి కదా. నేను ,తమ్ముడు కొట్టుకునేటప్పుడు నువ్వు అలా కొట్టుకోవద్దు అని దానివి కదా. నాకు చిన్నప్పుడు దెబ్బ తాకితే నువ్వు చాలా కాదా .నాకు తమ్ముడికి అన్నయ్యకి బట్టలు తీసుకొచ్చావు కదా అప్పుడు మేము చాలా బాగా ఆనంద పడేదాన్ని . నువ్వు మాకు అన్నం తినిపించే దానివి కదా నాన్నమ్మ. నేను చిన్నప్పుడు ఏడిస్తే నువ్వు జూపాడె దానివి కదా. ఆ జ్ఞాపకాలు గుర్తుకు వస్తే చాలా ఆనందంగా ఉంటుంది నాన్నమ్మ గారు..... 
ఇప్పుడు నువ్వు అలానే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను.
                            ఇట్లు,
                  మీ మనమరాలు ,
                      మండి. సమ్రీన్
          తరగతి: పదోవ తరగతి
                 క్రమ సంఖ్య : (06)
                     Z.P.h.s నర్మెట్ట
చిరునామా :-
గ్రామం:-నర్మెట్ట
మండల్:- నర్మెట్ట
జిల్లా:- జనగాం
రాష్ట్ర:-తెలంగాణ
పేరు :- హుసెన్ బీ
ఇంటి నెం:- 6-48

కామెంట్‌లు