గణనాథా ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 గండాలూ బాపే సామీ
రావయ్యా గానానాథా
కావవయ్య గానానాథా-మము  
కావవయ్య గానానాథా 
!!గండాలూ!!
సాంబశివుడి కొమరుడవయ్యా - నీవు
పార్వాతీ పుత్రుడవయ్యా 
కైలాసం దిగిరావయ్యా
కైలాసం దిగిరావయ్యా 
!!గండాలూ!!
ఏనూగూ మోమూ తోడా
ఎలుకా వాహానామెక్కీ
వేగామె రావేమయ్యా
వేగామె రావేమయ్యా 
!!గండాలు!! 
అటుకూలు ఆరాటిపండ్లూ
బెల్లామూ మోరుండాలూ 
తెచ్చీ నీకిచ్చెదమయ్యా
తెచ్చీ నీకిచ్చెదమయ్యా 
!!గండాలూ!!
ఉండ్రాళ్ళూ కుడుములు నీకూ
పాశామూ ఫలహారాలూ 
నైవేద్యం పెట్టెదమయ్యా
నైవేద్యం పెట్టెదమయ్యా 
!!గండాలూ!!
ఎల్లా విద్దేలా కెల్లా
సామీవీ నీవేనయ్యా
సకలా విద్దేలు నీవూ 
మాకియ్యీ ఓ గననాథా
నీపూజలు జేతూమయ్యా
సక్కగ నిను గొలుతూమయ్యా 
!!గండాలూ!!
**************************************


కామెంట్‌లు
Ramakrishna Patnaik చెప్పారు…
గణనాథుడి పేరన వ్రాసిన గేయం నాకు చాలా బాగా నచ్చింది!
కవితల నిధులు దాచుకున్న ఎద మీది!
అభినందనలు!-రామతాత!