హైడ్రా చేటలో చెరుగుతున్నకొద్దీ చెరువులు
మెరిగల్లా బయటకొస్తున్నాయి.
దాగిన రాజకోట రహస్యాలెన్నో
పడగొట్టబడుతున్నాయి.
చెరువుల ఉసుర్లు తగిలి
విల్లాలు మునుగుతున్నాయి.
నాలాల నజర్ గట్టిగా ముట్టి
నాగార్జున సాగరాలు కనబడుతున్నాయి.
కుంటలు కుంచించినందుకు
కన్వెన్షన్ల కహానీలు ముగుస్తున్నాయి.
సుద్దులు చెప్పే సుద్దపూసల
హర్మ్యాలు కూలుతున్నాయి.
సెట్ బాక్లు కాని సెలబ్రిటీల
భవంతులు శిఖంలో తేలుతున్నాయి.
కబ్జారాయుళ్ళ ఊసరవెల్లిరంగులు ఒక్కొక్కటిగా వెలిసిపోతున్నాయి.
కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా హై"డ్రామా"లే మిగులుతాయా?
నిజాలు నిగ్గు తేలుతాయా?
చెరువులు చెరల నుండి విముక్తమవుతాయా?
పెద్దోళ్ళ మేడలు పేకమేడలయ్యేనా?
పేదోళ్ళ కొంపలు ఆహుతయ్యేనా?
చెరువుల చిరునామాలు
దొరికేనా?
కాకతీయుల చరిత్ర రంగనాదమై వినిపించేనా?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి