ప్రియమైన తాతయ్య,
అమ్మమ్మ కు,
తాత బాగున్నావా అమ్మమ్మ బాగుందా , సమయానికి మందులు
వేసుకుటున్నావా, తాతయ్య అమ్మమ్మ నీకు గుర్తుందా నువ్వు నాకు చిన్నగా ఉన్నప్పుడు నాకు రోజు కథలు చెప్పి పడొకోబెట్టేదానివి గుర్తుందా అమ్మమ్మ. తాతయ్య నువ్వు నన్ను బావిదగ్గరికి నీమీద కూర్చొపెట్టుకుని తీసుకపోయే వాడివి కదా . తాతయ్య గుర్తుందా మనం ఇద్దరం బావిదగ్గర కంకులు వలుచుకొని తినేవాళ్ళం. తాతయ్య మల్ల మనము మేడారం జాతరకు పోయినం కదా , అప్పుడు నువ్వు నాకు జాతరలో పీక కొనిచ్చినవ్ . దానితోని నేను చాలా సంతోషంగా ఆడుకున్నాను. తాత మనం చిన్నపుడు దొంగ పోలీసు ఆటలు ఆడుకున్నాము. అప్పుడు నేను చాలా సంతోషంగా నీతోని ఆడుకున్నాను. అమ్మమ్మ , నువ్వు నేను తాతతో ఆడుకుంటుంటే నాకు అన్నం తినిపించే దానివి, నేను ఒద్దు అన్నా , నేను ఎక్కడికి వెలితే అక్కడకు వచ్చి అన్నం తినిపించే దానివి . నేను బావికాడికి వస్తే నాకు అక్కడ ఉన్న పండ్లు తెచ్చి ఇచ్చేవానివి తాత. నేను నీవల్ల చాలా జ్ఞానాన్ని పొందిన. అమ్మమ్మ నువ్వు మనం ఇద్దరం బావికాడికి పోతుంటే మంచి మంచి పాటలు పడేదానివి. నేను ఆ పాటలు వినుకుటూ నేను ఎగిరేవాడిని. మేము మీ ఇంటికి వస్తే చాలు మీరు మమల్ని చాలా బాగా చూసుకుంటారు. తాత మరియు అమ్మమ్మ నేను చిన్నతనంలో ఉన్నప్పుడు నన్ను చాలా బాగా చూసుకున్నారు. నేను పెద్దగా అయినాంక నేను మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటానని మీకు మాట ఇస్తున్నాను. నేను మిమ్మల్ని చాలా సుకంగా చూసుకుంటాను. తాతయ్య, అమ్మమ్మ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. నేను యిక్కడ చాలా బాగా ఉన్నాను. నేను ఎంత అల్లరి చేసిన మీరు ఏమీ అనలేదు. తాత మీరు సమయానికి తినండి మందులు వేసుకొండి. తాతయ్య, అమ్మమ్మ నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. మీరు ఇద్దరు నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. నేను మీకు అమ్మమ్మకు, నేను పెరిగిన తరవాత నా 1st జీతంతో మీకు ఏమైన తెస్తా. మీకు చాలా అంటే చాలా రుణపడి ఉంటా. తాత, అమ్మమ్మ మీకు నేను పాదాభివందనం చేస్తున్నా . మీకు చాలా ధన్యవాదములు. నేను ఏదైనా తప్పుగా ప్రవర్తించడం గాని, తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి.
చిరునామా
_______
|పేరు :-కొన్నే రాములు
|ఊరు పేరు :నర్మేట్ట
|వాడ పేరు :-ఎల్లమ్మ బజార్
|వార్డు నెంబర్ :-1 స్టేటస్ వార్డు
ఇట్లు మీ ప్రియమైన మనమడు
అరవింద్
10తరగతి
క్రమసంఖ్య (07)
Z. P. H. S Narmetta

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి