:నాన్నెందుకు ఓడునో;- దుడుగు నాగలత-సిద్దిపేట
 సీ.
ధరణియందున్నట్టి తనయుల కొరకును
త్యాగంబు జేసెడి దాతయెవరు?
కష్టంబులెన్నున్న గాయాలబాధను
కనులలో దాచెడి ఘనుడెవరది?
నిస్వార్థ సేవతో నిరతము వెంటుండి
లక్ష్యాన్ని చేర్చెడి లౌక్యుడెవరు?
లోకంబు తీరును  లోటుపాట్లన్నియు
సహజముగాజూపు సౌమ్యుడెవరు?
తే గీ
గుండె నిండధైర్యమునింపు గురువు నాన్న
మంచిచెడులను దెల్పెడి మార్గదర్శి
విలువనిండిన వాక్కులు విధిగ నేర్పు
తండ్రి యేకద కనిపించు దైవమిలను

కామెంట్‌లు