ముఖాముఖి (ఇంటర్వ్యూ); E.అపర్ణ;- తొమ్మిదవ తరగతి -ZPHS Narmetta -Dr.జనగామ


1) నమస్కారమండి మీ పేరు చెబుతారా?
 నమస్కారమండి  నా పేరు  శిరీష .
2) మీరు వ్యవసాయం ఎప్పటినుండి చేస్తున్నారు?
జ ) నా పెండ్లి అయిన నుండి 8 సంవత్సరం నుండి చేస్తున్నాను.
3) మీకు వ్యవసాయం చేయాలనే ఇష్టం ఎందుకు కలిగింది?
జ) నాకు వ్యవసాయం తెలియదు నేను పదవ తరగతి చదివాను మా నాన్న పొలానికి పోతుంటే నేను స్వయంగా చెయ్యకపోయినా మా నాన్నకి పొలం పనుల్లో సహాయం చేసే దానిని అలా నాకు వ్యవసాయం అంటే ఇష్టం కలిగింది.
4) మీరు ఎక్కువగా ఏ పంటలు పండిస్తారు?
జ) మేము ఎక్కువగా పండించే పంటలు 1)పత్తి 2) వరి 3)మిర్చి 4) కంది 5)మొక్క జొన్న పండిస్తాము.
5) మీకు ఎక్కువగా ఏ పంటలు  లాభాన్ని ఇస్తుంది?
జ) మాకు తెలిసినంతవరకు ఎక్కువగా లాభాన్ని ఇచ్చింది 1)పత్తి 2)మిర్చి లాభాన్ని ఇస్తాయి.
6)ఇంతవరకు అధిక లాభాన్ని పొందిన పంట ఏది?
జ) మాకు అధిక లాభాన్ని పొందిన పంట 1)పత్తి.
7) మీకు ఏ పంట నష్టాన్ని ఇస్తుంది?
జ) మొక్కజొన్న బాగా నష్టాన్ని ఇచ్చింది పత్తి ఎలుకలు వరి ఉడతలు మిర్చి పూతరాలడం మొక్కజొన్న కోతులు కంది అని ఒకే రకమైన నష్టాన్ని ఇస్తాయి.
8)నీరు అంతగా అవసరం లేని పంటలు ఏమిటి?
జ) 1)శనగలు2) కంది 3)పత్తి.
9) ఇప్పుడు అందరూ పామాయి

ల్ మొక్కలు పెంచుతున్నారు ఎందుకు?
జ) దేశవ్యాప్తంగా పామాయిల్ సాగు పెంచేందుకు  కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహాలు ప్రకటించింది అందుకు అందరూ పామాయిల్ మొక్కలు పెంచుతున్నారు.
10) మీరు మా విద్యార్థులకు ఇచ్చే సందేశం ఏమిటి?
జ) రైతు దేశానికి వెన్నుముక లాంటివాడు.రైతు దేశంలో ఎక్కువగా పనిచేసే వృత్తిలో వ్యవసాయం మొదటిది.మనం తినే ఆహారాన్ని పండించేవాడు రైతు. దేశానికి రైతుచాలా ముఖ్యం. రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడి పంటల్ని  నపండించి మనకు ఆహారాన్ని అందిస్తాడు రైతు. రైతు లేనిది తిండి లేదు.రైతుని గౌరవించాలి రైతే రాజు అవ్వాలి.
 
కామెంట్‌లు