ఆడపిల్ల కథ;- జక్కుల లోహిత -తొమ్మిదవ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బక్రిచెప్యాల -జిల్లా సిద్దిపేట.-8125730317.
 ఒక ఊరిలో శ్రీను,శ్రీలతలకు శ్రీకర్ ,శ్రీవాణి అనే కుమారుడు కూతురు జన్మించారు.
దినదినము పెరిగి పెద్దవుచుండగా శ్రీకర్ ను మాత్రమే బడికి పంపేవారు. శ్రీవాణిని ఇంటి పనులకు, పొలం పనులకు పంపేవారు. కొడుకును బడికి పంపితే చెడు స్నేహితులతో కలిసిపోయి చదువుల వెనుకబడిపోయి పరీక్షల్లో ఫెయిల్ అయినాడు. కూతురు శ్రీవాణికి ఏ పని అప్పజెప్పిన అయిపోయేంతవరకు ఊరుకునేది కాదు.
సాయంకాల వేళ స్నేహితుల దగ్గరికి వెళ్లి నాకు చదువు నేర్పించమని బతిమిలాడేది. స్నేహితులు చెప్పమన్నా గానీ విడిచి పెట్టేది కాదు.
బాయి కాడికి వెళ్లినప్పుడు అక్కడ దొరికే సీతాఫలాలు, జామ పండ్లు, అల్లనేరేడు పండ్లు తీసుకువచ్చి స్నేహితులకు ఇచ్చేది.
ఆ విధంగా వారు శ్రీవాణికి చదువు నేర్పించేవారు. క్రమక్రమంగా పుస్తకాలు చదవడం అలవాటయింది. తాను దాచిపెట్టుకున్న డబ్బులతో ఫీజులు కట్టి పరీక్షలు రాసింది. అందరికంటే మొదటి స్థానంలో పాస్ అయింది. ఇలా పట్టుబట్టి డాక్టర్ అయింది. అమ్మానాన్నలను మంచిగా పోషించేది. కానీ కొడుకు చెడు అలవాట్లకు పాడైపోయాడు. చివరికి ఏ జాబ్ దొరకక ఊరికే ఉన్నాడు.
 శ్రీవాణి అతనికి ఒక మెడికల్ షాప్ పెట్టించి ఉపాధి చూపించింది. తల్లిదండ్రులు ఆడపిల్లలపై చిన్న చూపు చూడకూడదని వారిని కూడా మగ పిల్లలతో సమానంగా చూడాలి.



కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Super
అజ్ఞాత చెప్పారు…
Wow super very good nice story
అజ్ఞాత చెప్పారు…
Super ra mummy