వెలుగు- విజయం.;- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797..
దీపావళి శుభాకాంక్షలతో ---
===================
 1.
మానవుడే మహనీయుడు,
       జగాన మాననీయుడు!

సృష్టికి ప్రతి సృష్టి,     
 విశ్వామిత్రుడు మానవుడు! 

గగనయాన చంద్రయానాల,  
   నరుడు మేటి శాస్త్రజ్ఞుడు !

రవి కాంచనిది కాంచే,
            కవి ఋషీశ్వరుడు!

ఇంద్రునికే తోడు నిలిచిన,
         చక్రవర్తి  రణధీరుడు!

2.
అమావాస్య నిశి యత్నాన,   
   ఆకాశాన ప్రకాశించు శశి!

ఇంటింటా వెలిగే దీపాలొకటై,
విశ్వమంతా విస్తరించు రశ్మి! 

కాల్చే బాణసంచా అసుర,
సంహార విజయ సంకేతం! 

మన దరహాస దీపాలు ,
     ఆరని మణిదీపాలు! 

పండుగ పలకరింపులు,    
     ఆనందాల పాలవెల్లులు! 

3.
బయట వెలిగే దీపం,
 చీకటిపై వెలుగు విజయం! 

అంతరంగ జ్ఞాన దీపం,
    నిత్యం బుద్ధి ప్రచోదనం! 

వెరసి అంతరంగ బహిరంగ,  
  దీపం వికాస ప్రతిరూపం! 

మనిషి దీపమై ఇంటింటా,
     దీపాలు వెలిగించాలి! 

దీపం ఆరిపోయినా వెలిగే,
దీపాల్లో వెలుగై ఉంటుంది! 
_________


కామెంట్‌లు