ఊహలు
రూపందాల్చాయి
భావాలు
బయటపడ్డాయి
అక్షరాలు
దొర్లాయి
పదాలు
పొర్లాయి
కిరణాలు
ప్రసరించాయి
చీకట్లు
తొలగిపోయాయి
మనసు
పొంగింది
హృదయం
కరిగింది
ప్రేమ
ఫలించింది
గమ్యం
దొరికింది
ఉల్లం
ఉత్సాహపడింది
గుండె
దిటువయ్యింది
మాట
గొంతుదాటింది
కవిత
పుటలకెక్కింది
కవిత్వం
సాగింది
సాహిత్యం
కూడింది
శారద
కరుణించింది
కవిత
జనించింది
పాఠకులు
పరవశించారు
విమర్శకులు
విస్తుపోయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి