ప్రమిద;- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
కాంతి కళాకారుల వృత్తి చేతుల 
విరబూసే మన్ను ప్రమిద ఎద

పండుగ దీపావళి
హిమాలయ ఆరావళి 
మినుకు మినుకు బాణసంచా
ఎగిసే ఎడద ఆనందం జండా ఊంచే హమారా

ఒక బంధువో లేక సోపతో పరవశం
కాంతి పూల శోభ కాకరవొత్తుల 
మెరిసే కమ్మని కావ్యం 

కొత్త కాంతి 
విరిసిన చుక్క పూల తోట
బతుకే ప్రమిదల వెలిగే దీపావళి



కామెంట్‌లు
K.Ravindra chary చెప్పారు…
"తన సంతోషమే స్వర్గం "అన్నట్టు గా మానసిక ఆనందమే ఏ పండగైనా.. బంధువులతో లేదా స్నేహితులతో కలిసి పంచుకుంటేనే ఆ అనుభూతి. ప్రమిద లోని వెలుగు జ్యోతులు మానస్కా ఉల్లాసం లోనే ఉంటాయి. ఈ భావమే అత్యుత్తమంగా కవీ శ్వర్లు. ప్రకటించారీ చిన్న గీతం లో. కంగ్రాట్స్.
prasadklv చెప్పారు…
బాగుంది సర్
మీ దీపావళి కవిత.