ఆదర్శ బామ్మ! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఉమ్మడి కుటుంబాలు గుమ్మడి చెక్కల్లాగా ముక్కలవుతున్న రోజులివి.అత్త కోడళ్లు హలో అంటూ పలకరింతలతో సరిపెట్టుకోటం వృద్ధాశ్రమాలు గతి నేటి ఆనవాయితీ.ఆనాడు మహాభారతంలో  కౌరవపాండవ పుట్టుకలకు కారణం ఆదర్శ అత్తగారు బామ్మ సత్యవతి ఐతే నేడు అందరి అభిమానం గౌరవం చూరగొంటున్న ఆదర్శ బామ్మ నవాజ్ బాయి.రతన్ టాటా ఆయన తమ్ముడిని పెంచిన బామ్మ. ఇప్పటికైనా వెలుగులోకి వచ్చి ఆదర్శ భారత మాతగా తెలివితేటల తరుణిగా ఆమె జీవితం స్ఫూర్తిదాయకం.ఆగర్భశ్రీమంతురాలైన కోడలు నవాజ్ బాయి భర్త మరణంతో నావల్ అనే బీద బాలుడిని దత్తత తీసుకోవటం ఓఎత్తు ఐతే టాటాసన్స్ కి తొలి మహిళా డైరెక్టర్ ఛైర్ పర్సన్ గా ఆమె పేరు గాంచారు.ఇంకాముఖ్యవిషయం ఏమంటే కోడలు విడాకులు తీసుకున్న తర్వాత వేరేపెళ్లి చేసుకున్నా చలించక మనవల బాధ్యత నెత్తిన వేసుకున్న ఆదర్శ బామ్మ. కృంగిపోకుండా వితంతురాలైన ఆమె ఆదర్శ తల్లిగా నిలిచింది.ఆపై రతన్ కి లలిత కళలపై ఆసక్తి పెంచిన బామ్మ మూగజీవాలపై ఆప్యాయత ప్రేమను పంచమని ఆదర్శంగా నిలిచింది.మనవడు రతన్ టాటా మరణంతో బామ్మ బంగారుబాట వెలుగు లోకి వచ్చింది.ఇలాంటి క్రొవ్వొత్తులు ఆదర్శ మరుగున పడిన మహిళామణులు  ఎందరో??!!వీరిని గూర్చిన యథార్ధాలు వెలుగుచూడాలని  పాఠ్యపుస్తకాలలో చోటు చేసుకోవాలని ఆశిద్దాం🌷
కామెంట్‌లు