కాలం చెల్లిన తరుణంలో
కొమ్మను వీడే క్రమంలో
నేలను రాలే ఆకులు
దారిని తివాచీ పరచెనేమో!
అవనికి తరువులు కట్టిన
పసుపు రంగు పట్టుచీర
అందమైన కాంతులు చిమ్ముతూ
రారమ్మని పిలిచెనేమో!
అడుగులకు మడుగులొత్తుతూ
ఆప్యాయంగా ముద్దిడుతూ
ఆత్మీయుల ఆగమనంకోసం
ఆత్రంగా ఎదురుచూస్తున్నదేమో!
ఇనుమడించిన సోయగాలతో
ఇలాతలం మెరిసిపోగా
కోలాహలంగా కోరిక గలగ
అలా..నడిచి పోవాలనిపించదూ!?
కనుచూపు సాగినంత మేరా
రంగులీను రహదారిని
మేనుమరచి మంత్రముగ్ధలై
మమేకమైపోవాలనిపించదూ?!
గోపురంగా కొమ్మలు
ఇరువైపుల చేయికలిపి
తోరణమల్లే శోభిల్లగా
కదిలి వచ్చు వేకువకు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి