శ్లో: ధీయంత్రేణ వచోఘటన కవితాకుల్యోప కుల్యాక్రమై
రానీతైశ్ఛ సదా శివస్య చరితాంభోరాశీ దివ్యామృతైః
హృత్కేదారయుతాశ్చ భక్తికలమా సాఫల్య మాతన్వతే
దుర్భిక్షా న్మయ సేవకస్య భగవన్విశ్వేశ భీతిః కుతః !!
భావం:
హే ! భగవాన్ ;విశ్వేశ్వరా ! బుద్ధి అనెడి ఏతముతో ,స్తోత్రవచనములు అనెడి కుండలుచే,కవిత్వమనెడి పిల్ల కాలువలుద్వారా పైకి తేబడిన పరమేశ్వరుడు, అయినా నీ యొక్క చరిత్రము అనెడి సముద్రము యొక్క మంచినీటితో హృదయం నందు మొలకెత్తిన భక్తి అనే వరి పైరులు మంచి పంట
పండుతున్నాయి . సదాశివా నీసేవకుడు అయినా నాకు కరువు వలన భయం లేదు !
****
శివానందలహరి;- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి