(1) మా ఆయన ఈ మధ్య బాగా మారిపోయారు తెలుసా ?" ఏడుస్తూ అంది రాధ.
" ఏమయ్యిందో చెప్పవే,నాకు తోచిన సలహా ఇస్తాను" అనునయం గా అంది అనురాధ.
" పెళ్ళి కాకముందు ప్రేమిస్తున్నానంటూ వెంటబడే రోజులలో నువ్వు లేకుండా బ్రతకలేనంటూ హుషారుగా పాత సినిమాలలో శోభన్ బాబులా సినిమా డైలాగులు చెప్పేవారు. ఈ మధ్య జీవితమే నరకం, జీవితం మూణ్ణాళ్ళ ముచ్చటే అంటూ మజ్ఞూ లా విషాదం గా పాటలు పాడుతున్నారు" ముక్కు చీదుతూ అసలు సంగతి చెప్పింది రాధ.
(2) " ఏమిటండీ ఈ రోజు ఇంత త్వరగా ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసారు ?" మూడు గంటలకే ఇంటికి చేరుకున్న భర్త గణేశ్ ను అడిగింది భార్య కమల.
" ఫైలు తీసుకెళ్ళి ఆఫీసరు గారి ముందు పెడితే కోపం గా నాలుగు తిట్లు తిట్టీ గో టు హెల్ అన్నాడు. వెంటనే ఇంటికి అదే నా హెల్ కు వచ్చేసాను" అసలు సంగతి చెప్పాడు గణేశ్.
(3) " నేనెంత కన్విన్స్ చేస్తున్నా మా పేరెంట్స్ మన పెళ్ళికి ఒప్పుకోవదం లేదు !" పెదవి విరుస్తూ అంది రేఖ.
" మరైతే ఏం చేద్దాం ? లేచి పోయి పెళ్ళి చేసుకుందామా ?" అడిగడు శేఖర్.
"అటువంటి నీచపు పనులు మా ఇంటా వంటా లేవు.ఇంక మనము బ్రతికి వేస్ట్ అనిపిస్తోంది నాకు"
" ఏం చేద్దాం"
" నువ్వు ఏ రైలు కిందో తల పెట్టేయి."
" నాకైతే ఒ కె, మరి నువ్వో?"
" నువ్వు లేని జీవితాన్ని ఊహించుకుంటూ,మన గతపు అనుభవాలను నెమరు వేసుకూంటూ ఏ గొట్టం గాడినో పెళ్ళి చేసుకొని బ్రతికేస్తాను " తాపీగా చెప్పింది రేఖ.
(4)" నీ కోసం నేను ఏం చెయ్యడానికైనా సిద్ధం గా వున్నాను. ఏం చెయ్యమంటావో చెప్పు. సింగిల్ హాండ్ తో కళ్ళకు గంతలు కట్టుకొని బైక్ ను నడపమంటావా ?లేక నిన్ను ఎత్తుకొని ఎవరెస్ట్ శిఖరం ఎక్కమంటావా ?" ఆవేశం గా అడిగాడు మన్మధరావు.
" అవేం వద్దులే గాని, నేను రేపు ఫస్ట్ షో కి ఐమాక్స్ లో సుశాంత్ తో సినిమాకు వెళదామనుకుంటున్నాను. మా ఇద్దరికీ రెండు టికెట్లు తెచ్చి ఇవ్వు చాలు " అసలు సంగతి చెపింది భార్గవి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి