అన్నీ ఉండి అసంతృప్తితో బతికే మనం వీరిని గూర్చి తెలుసుకున్న తర్వాత సిగ్గుతో తలొంచుకుంటాం!తమిళనాడుకు చెందిన జనని కి అన్నీతానై పెంచింది తల్లి అమ్మాళ్! సి.ఎ.చదవాలనుకునే జననిలో సేవదాతృత్వభావాలు మెండు.అందుకే స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తూ బి.కాం.చదువుతున్న ఆమె ప్రమాదంలో మృత్యువాత పడింది.భర్త కూతురుని కోల్పోయిన బ్యాంకు ఉద్యోగి అమ్మాళ్ తన పొలంలో స్కూల్ కి రాసేసి పేదబాలికల పెళ్లికి చేయూతనిస్తూ కూతురి ఆశయాలు నెరవేరుస్తోంది ఆతల్లి.
కేరళకు చెందిన విష్ణు రోడ్డుప్రమాదంలో చనిపోయాడు.అశోక్ అనే వ్యక్తికి అతని గుండెను అమర్చారు. అతను విష్ణు ఇంటికెళ్లాడు. అతని తల్లి దరిద్ర బాధతో పాటు పుత్ర శోకం అనుభవించటం చూసి ఆమెకి వైద్యం చేయించాడు. ఆమె చనిపోతే అశోక్ దహనసంస్కారాలు చేసి తన ఋణం తీర్చుకున్నాడు.ఆమె కూతురుకి అండగా ఉన్నాడిప్పుడు. పశ్చిమ బెంగాల్ కిచెందిన బోధిని కొడుకుతో కేరళ కి వైద్యం కోసం వచ్చింది.తనకు చావు దగ్గర పడుతున్నది తెలుసుకున్న ఆమె సొంత ఊరికెళ్లాలని కోరింది.కొడుకు సరేనన్నాడు.కానీ3వేల కి.మీ.యాంబ్లెన్స్ డ్రైవర్ అరుణ్ ఓనర్స్ తో కలిసి 3వేల కి.మీ.దూరాన్ని డ్రైవ్ చేసి 2రోజుల్లో ఆమెని ఇల్లు చేర్చాడు. కేవలం పెట్రోల్ చార్మి తీసుకున్న అరుణ్ మానవత్వం ముందు మనం బలాదూర్ కదూ🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి