స్ఫూర్తి ప్రదాతలు56 :- సేకరణ :అచ్యుతుని రాజ్యశ్రీ
 చిన్నారుల ప్రతిభా పాటవాలు ఈరోజు ప్రపంచ మంతా మార్మోగుతున్నాయి.కాలిఫోర్నియాలో ఉన్న కైరాన్ ఖ్వాజీ ఐ.క్యూ.ఎక్కువ. అందుకే11ఏళ్లకే శాంటాక్లారా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ లో చేరాడు.బ్లాక్ బర్డ్ ఏఐ లో మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్ గా పనిచేసిస్పేస్ ఎక్స్ లో జాబ్ సంపాదించిన బుడత. అంటే 14 ఏళ్ల కే అందలం ఎక్కాడు. 
తన 11 వ ఏటనే అక్సా మస్రత్ గడగడ మాట్లాడుతూ జనాలను దడదడలాడిస్తుంది.ఆవకాయ మొదలు అంతర్జాతీయ విషయాలు బాలలహక్కులతో సహా టాపిక్ ఏదైనా అదరగొడ్తుంది. కోవిడ్ టైంలో వీడియోలు చేయటం మొదలు పెట్టింది.సమాజం దేశంలోని సమస్యలను అందరిముందుకు తెస్తోంది. విరాళాలు సేకరించి సాయం చేస్తుంది.కాశ్మీర్ బాల "వాట్ అక్సా సే" పేరుతోయూట్యూబ్ ఫేస్బుక్ అన్నిటిలో తానై ప్రేరణ కలిగిస్తోంది.
మణిపూర్ బాలిక లిసిప్రియ కంగుజం పర్యావరణ పరిరక్షణ పై టకటక మాట్లాడుతుంది. 100పైగా దేశాల్లో వాతావరణం మన కర్తవ్యం గూర్చిప్రసంగించింది.వరల్డ్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్   ది ఇండియా పీస్ ప్రైజ్ అబ్దుల్ కలాం అవార్డులందుకున్న చిన్నారి.ఇలాంటి వారిగూర్చి పాఠ్యపుస్తకాల్లో ఉంటే పిల్లలకు ఉత్సాహం కల్గుతుంది🌹

కామెంట్‌లు