స్ఫూర్తి ప్రదాతలు 59:- సేకరణ..అచ్యుతునిరాజ్యశ్రీ

 సిటీలో ఉన్నవారు అనాగరిక ఫ్యాషన్ లో రొచ్చులోకి జారిపోతుంటే పల్లెల్లో వారు ఎంత ప్రశాంతంగా ఉన్నారో చదవండి.ఛత్తీస్గఢ్ లో పల్లె లచ్కెర. ఆపల్లె లో సరస్సు చిట్టడవి కువకువలాడే పిట్టలతో కళకళలాడుతుంది. రకరకాల పక్షులు విదేశాలనుంచి వచ్చి పొలాల్లో పురుగుపుట్రలతిని గుడ్లు పెడ్తాయి.సెల్ టవర్లు లేకుండ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.10కి.మీ.మేర టవర్లుండవు. మైకులు బ్యాండ్ చప్పుళ్లు బాణసంచాలునిషిద్ధం. 
మహారాష్ట్ర లోని బన్సీ అనే గ్రామంలో 18ఏళ్లలోపు పిల్లల కు సెల్ఫోన్లు ఇవ్వరు.తనిఖీ చేస్తారు ఇంటింటికెళ్లి. ఆబృందం 5వేలరూపాయల జరిమానా కూడావేసి పెద్దలకు క్లాస్ తీసుకుంటారు.పిల్లలు పెద్దలకు పోటీలు ఆటపాటలు పుస్తకాలను చదవడం నిర్బంధం చేశారు.
గుజరాత్ లోనిరాజ్పుర్ పల్లె ఐక్యత కు భాష్యం చెప్తోంది.అంతా కలిసి సమర్ధుడైన విద్యావంతుని ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకుంటారు. వడ్డీవ్యాపారంలేదు. మగాళ్లు ఉమ్మడి వ్యవసాయం ఆడవారు అప్పడాలుచేసి లిజ్జత్ బ్రాండ్ కి అమ్ముతారు.🌹
కామెంట్‌లు