స్ఫూర్తిప్రదాతలు 61 సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ
బీహార్ కిచెందిన మష్రూంమాన్ శశిభూషణ్ తివారీ డిగ్రీ కాగానే ఢిల్లీలో అష్ట కష్టాలు పడ్డాడు.పస్తులతో కార్లు క్లీన్ చేస్తూ కూరలు పళ్లు అమ్మాడు. తొలిసారి బటన్మష్రూంకర్రీ తిన్నాడు శాకాహారిఐన శశి!హర్యానా వెళ్లి పుట్టగొడుగుల పెంపకంగూర్చి తెలుసుకున్నాడు.కోవిడ్ వల్ల బీహార్ వచ్చిన అష్ట పుట్టగొడుగుల వ్యాపారంకి ఎన్నో తిప్పలు పడి ఆఖరికి పుట్టగొడుగుల పెంపకంతో నెమ్మదిగా 4ఏళ్లకి తన గోల్ సాధించాడు.ఇప్పుడు దాదాపు 3వేల కిలోలు దేశ విదేశాలకు ఎగుమతిచేస్తున్నాడు. 
రాజస్థాన్ లో చిన్న రేకులింట్లో పెరిగాడు.అలాంటివాడు కోడింగ్ నేర్చుకుని బిట్స్ పిలానీలో మైక్రోఎలక్ట్రానిక్స్ లో సీటు సంపాదించాడు. పార్ట్ టైంజాబ్స్ చేస్తూ ఫీజులు కట్టేవాడు.దుబాయ్ పోలీసుశాఖ లోసర్వీస్ ఇంజనీర్ గా కొన్నాళ్లు పనిచేశాడు. 2015 లో టెక్నికల్ గురూజీ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు.సాంకేతిక విషయాన్ని హిందీలో రకరకాల విషయాలు మోసాలు వివరించడంతో జనాలు మెచ్చారు. యూట్యూబ్ లో టెక్నాలజీలో మార్పులను వివరిస్తాడు. ఢిల్లీ దుబాయ్ లో ఇళ్లు కొన్నాడు.శామ్ సంగ్ గూగుల్ కూడా సలహాలు తీసుకుంటాయి. టిమ్ కుక్ స్వయంగా ఆహ్వానించాడు గౌరవ్ ని.
పుణె కి చెందిన ప్రశాంత్ షా ఆర్కిటెక్ట్.అతనుఅందరూ తమకు పనికిరాదని ఇచ్చే ఫర్నిచర్ పుస్తకాలు అన్నీ సేకరిస్తాడు. తక్కువ ధర కి అమ్ముతాడు.కథల పుస్తకం రూపాయికే ఇస్తాడు.తన ఆదాయంలో కొంత పేద పిల్లలఫీజు కడ్తాడు🌹

కామెంట్‌లు