స్ఫూర్తిప్రదాతలు 62:- సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 చెన్నైలో సంప్రదాయం భక్తి ఎక్కువ అని ఒప్పుకొని తీరాలి.మైలాపూరు లో ధనుర్మాసంలో బాలికలను గోదాదేవిగా అబ్బాయిలను రాముడు కృష్ణుడుగా అలంకరించివీధుల్లో దైవంపై పాటలు పాడుతూ ఊరేగింపుగా సాగుతారు. 500ఏళ్లుగా ఈసంప్రదాయాన్ని అక్కడ సంగీత విద్వాంసులు పాటిస్తూ ప్రేరణ కల్గిస్తున్నారు. మనం పిల్లలకు తెలుగుపద్యాలు పాటలు శ్లోకాలు నేర్పటానికి బద్ధకిస్తాం.చిన్న చూపుచూస్తాం.
మన సరిహద్దులవద్ద కాపలాకాసేవారు బి.ఎస్.ఎఫ్.జవాన్లు. చుట్టుపక్కల సరిహద్దులవద్ధ కాపలాకై తేనెటీగల పెంపకం మొదలుపెట్టారు.కంచెదాటితే చాలు చొరబాట్లదార్ల పనిబడ్తాయి. మరి దేశ ద్రోహులు డబ్బుల కోసం ఆశపడి విదేశీఅక్రమార్కులతో చెయ్యికల్పటం విచారకరం.మన సైనికుల భద్రతాదళాల త్యాగం నేలపాలవుతోంది ఇలాంటి ద్రోహులవల్ల. 
127ఏళ్లక్రితం అర్దేశిర్ గోద్రెజ్ ఒకన్యాయవాది. బొంబాయిలో దొంగలు పెచ్చుపెరిగారు. అంతే ఆయన బుర్రలో కొత్త ఊహ తళుక్కుమంది. ఆయనకు సంతానంలేదు.బంధువు ఫిరోజ్ షాతో కలిసి ఇనప్పెట్టెలతయారీ తాళాలు తయారుచేయసాగారు.అలా గోద్రెజ్ వ్యాపారం పుంజుకు సబ్బులుమొదలు ఏరోస్పేస్ హెల్త్ కేర్ దాకా సాగుతోంది.వీరి మూడో నాలుగో తరంవారుకూడా సింపుల్ లివింగ్ హైథింకింగ్ కి ప్రాధాన్యత ఇస్తారు ఇప్పటికీ.విందులు విలాసాలు తమవరకే పరిమితం.తమలగేజీ తామే మోస్తూ ఎకానమీక్లాస్ లో పయనిస్తారు. యజమాని ఉద్యోగులు ఒకేబల్లపై శాకాహారభోజనం తింటారు.స్వాతంత్య్ర పోరాట సమయంలోతిలక్ నిధికి 3లక్షలు విరాళం ఇచ్చిన దాతలు🌹
కామెంట్‌లు