స్ఫూర్తిప్రదాతలు 66:- సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ
 స్వామి వివేకానంద ఓవార్తను చదివారు.పసిఫిక్ మహాసముద్రంలో ఓడలుమునిగిపోసాగాయి పెనుతుఫాను లో! ఒకేఒక ఓడ ముందుకు సాగుతోంది.మునుగుతున్నవారు  సాగిపోతున్నవారికి చేతులూపుతూ అభినందించారు.ఆఫోటోని"ఇలస్ట్రేటెడ్ లండన్ న్యూస్" అనే పేపర్ లో స్వామీవివేకానంద చూశారు.ఆయన ఇలా అన్నారు"మనం పతనావస్థలో ఉన్నాం అని ఇతరులు కూడా అలా ఉండాలని కోరటం తప్పు.వారికి మంచి జరుగుతున్నందుకు సంతోషిద్దాం.మన భారతీయ ఋషులు యోగులు కూడా కష్టాలకు చలించరాదు అనే చెప్పారు." అందుకే యువత ఈభావంని  అర్ధం చేసుకోవాలి.పరీక్షల ఒత్తిడికి లోనుకారాదు  .
జెస్సికా కాక్స్ కి పుట్టినప్పుడే రెండు చేతులులేవు. 25 ఏళ్లకే కాళ్లతో విమానం నడపటానికి లైసెన్స్ పొందిన తొలి క్రీడాపైలెట్. 10వేల అడుగుల ఎత్తున విమానం నడిపింది. ఈత కొడ్తుంది. కాళ్లతో రాయడం కరాటే లో ప్రావీణ్యత ఆమెసొత్తు.
19వశతాబ్దిలో బ్లోండిన్ అనే సాహసి నయాగరా జలపాతంకి అటుయిటు కొండలకు కట్టిన త్రాడుమీద నడిచేవాడు.ఒకరోజుఒంటిచక్రం తోపుడుబండిలో సిమెంట్ బస్తావేసుకుని తోడునీడ నడిచాడు. మనం అలా చేయనవసరంలేదు. పరీక్షల హడావిడి ఒత్తిడికి లోనై మార్కులు గ్రేడ్స్ కోసం పిల్లలు వారి అమ్మ నాన్నలు ఇతరులతో పోల్చుకుని బాధపడి ప్రాణాలు తీసుకోవడం సమర్ధనీయంకాదు🌹

కామెంట్‌లు