ఎల్లమ్మ జాతర:- యం.సహనశ్రీ -6 వ తరగతి- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రేగులపల్లి-మం.బెజ్జంకి -జిల్లా.సిద్దిపేట

 అనగ గనగా ఒక ఊరు ఉండేది.ఆ ఊరి పేరు ఇబ్రహీంనగర్ అక్కడ తేదీ 4-4-2024 న రాత్రి 7.30.ని.షా.లకు జాతర మొదలైంది.అప్పుడు మేము ఆ ఊరికి వెళ్లాము. మేము ఉదయమే లేచి తయారై బోనం తలపైన పెట్టుకొని హారతులు పట్టుకొని డప్పులు చాటింపులతో ఎల్లమ్మ గూడికి పోయినం. అక్కడ చాలా  జనాలు ఉన్నారు. మేము గుడికి పోగానే కొద్దిసేపు నిలుచున్నాం. ఆ తర్వాత మాకు కూర్చోవడానికి స్థలం దొరికింది. అప్పటికే అయ్యగారు అక్కడ పూజ మొదలు పెట్టారు అక్కడికి చాలా బొమ్మలు వచ్చినవి మా తమ్ముడు చూచి బొమ్మలు కావాలని ఏడ్చినాడు. అప్పుడు మా అమ్మ వెళ్లి వాడికి కావలసిన బొమ్మలు కొనిచ్చింది. ఆ తరువాత కొద్దిసేపు కూర్చున్నాం. కొద్దిసేపటికి పోతరాజు వచ్చాడు ఆయన మేకను కొరికి ఆ మేక యొక్క రక్తం తాగాడు. ఆ తర్వాత గుడి చుట్టూ తిరిగి ఇంకా అక్కడ ఉన్న భక్తుల మీదికి ఉరికాడు ఆ గుడి పక్కనే ఒక పెద్ద ఫంక్షన్ హాల్ ఉంది మేము ఆ హాల్లోకి పోయి అక్కడి నుంచి పోతరాజును చూసినం కానీ కొంతమంది అదే ఫంక్షన్ హాల్ లో కూర్చున్నారు. ఆ తర్వాత మా అక్క పెద్దమ్మ అన్న పెద్ద బాపు  అక్కడే ఉన్నారు మేము ఇంటికి వచ్చి అన్నం తిని పడుకున్నాము. అప్పటికే సమయం ఒకటి అయింది. కొద్దిసేపటి తరువాత మా వాళ్లు కూడా ఇంటికి వచ్చి తిని పడుకున్నారు. మళ్లీ పొద్దున లేచి ఆటో కి ఫోన్ చేసి మా ఇంటి పక్కన ఉన్న పెద్దమ్మ వాళ్లతో కలిసి ఇంటికి వచ్చాము.
కామెంట్‌లు