మల్లారం అనే గ్రామంలో లక్ష్మి అని పేరు గల ఒక అమ్మ ఉండేది. ఆమెకు ఇద్దరు కుమారులు. వారి పేర్లు శ్రీధర్, సాయి. సాయి చాలా అల్లరి పిల్లవాడు. శ్రీధర్ అమ్మకు సహాయం చేస్తూ ఉండేవాడు.
సాయి బజార్లో తిరుగుతున్నాడని, ఎప్పుడు ఆటల్లో నిమగ్నం అయి హోం వర్క్ చేసే వాడు కాదు. మంచిగా చదువుకోవాలని హాస్టల్లో వేశారు
సాయిని హాస్టల్లో చేర్పించాక కూడా బుద్ధి మారలేదు. శ్రీధర్ కి వాళ్ల పాఠశాల ఉపాధ్యాయులు అమ్మ విలువ గురించి చెబుతుంటే సాయి వచ్చాడు.
తమ్ముడి రాకడను చూసి ఎదురెళ్లి కౌగిలించుకుందామని వెళ్తున్న అన్నను చూసిన సాయి "ఛీ పోరా" అన్నాడు.
ఎప్పుడూ నిన్నే అమ్మానాన్న మెచ్చుకుంటారు. నన్ను ఎప్పుడూ ఈసడిచుకుంటారు అని మనసులో అనుకొని.
సర్లేరా తమ్ముడు! టీచరు అమ్మ విలువ గురించి చెప్తుంది విని పోదాము అని సాయితో అన్నాడు.
నేను రానని దురుసుగా సమాధానం ఇచ్చాడు సాయి.
నువ్వు రాకపోతే రాకు అని సాయి గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. ఆ గ్రౌండ్లో ఆడుకోవడానికి ఎవరు లేరు. అందరూ చదువుకుంటున్నారు. అతను ఒక బండరాయి మీద కూర్చుని అన్ని ఆలోచిస్తున్నాడు. అందరూ చదువుకుంటే నేను ఒక్కడిని ఖాళీగా కూర్చుంటే లాభం లేదనుకొని సాయి తరగతి గదికి పక్కగా వెళ్లి గోడచాటు నుండి మేడం చెప్తున్నా మాటలు విన్నాడు.
నేను మా అమ్మని తిడుతున్నది నిజమే. అమ్మ నిజంగా దేవుని రూపమే. అమ్మ చేసే పనులకు నేను ఏమిచ్చినా నా రుణం తీరది. గట్టిగ అరిచి తిట్టిన మాటలు గుర్తొచ్చాయి. బాధపడ్డాడు. లోలోపల ఏడ్చాడు.
సాయిని గమనించిన శ్రీధర్ తమ్ముడు బాధపడకు రా. నీవు అమ్మను అర్థం చేసుకుంటలేవు కానీ అమ్మకు నువ్వంటే చాలా ప్రేమ. ఏడవకురా. అమ్మది రేపు పుట్టినరోజు సంతోషంగా జరుపుకుందాం అని శ్రీధర్ అన్నాడు. అందుకు సరే అన్నాడు సాయి.
వెంటనే వెళ్లి క్షమించమని తల్లి కాళ్ళ మీద పడ్డాడు.
నేను క్షమించేది ఏముందిరా సాయి అని అమ్మ సాయి ని ఓదార్చింది. ఇంతకుముందు తెలియక అన్నావు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు అని అనగానే సాయిలో భారం దిగిపోయింది.
అప్పటినుండి అమ్మను గౌరవిస్తూ ఉన్నాడు.
నీతి: అమ్మ లేదా నాన్న ఎవరైనా మన మేలుకోరి హెచ్చరిక వేసినప్పుడు తప్పుగా భావించరాదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి