దేవరాగమును తీస్తూ
ఆ దేవదేవుని పూజిస్తూ
ఉంటే బ్రతుకంతా హాయి
లేకుంటే ఇక చింతేనోయి !
ఆ దేవుడు ఉన్నాడంటూ
నమ్మకమే నీకింకా ఉంటే
ఆ దేవుని నీవు కొలువు
సత్య పథములో నిలువు !
కొలిచే దేవుడు వరమిస్తాడు
తలిచే కొద్ది వరమందిస్తాడు
కొదువన్నది ఉండదులే నీకు
ఆ దేవుని ఇక మరచిపోకు. !
ఆ దేవుడు చూపిన దయవల్ల
నడుస్తున్నది ఈ ప్రపంచం మెల్ల
అని మనం అందరకు చెప్పుదాం
కని ఈ నిజం ముడీ విప్పుదాం. !
నిజం తెలుసుకున్న జనమంతా
చేరుతారులే ఆ దేవదేవుని చెంత
భక్తితో దేవుని వారు పూజిస్తారు
అనురక్తితో గుడిలో చేరి చెరిస్తారు
ఆ గుడిలో చేరిన ఆ భక్తజనం
మడికట్టుక వస్తారు అనుదినం
ఆ దేవుని మనసారా కొలిచేరు
ఆ దేవుని ముందర నిలిచేరు. !
దేవుని వ్రతమును చేద్దాం
బంధుమిత్రుల ఆహ్వానిద్దాం
తీర్థ ప్రసాదముల అందిద్దాం
ముక్తిని ఇవ్వమని ప్రార్థిద్దాం !
మన మొర విని ఆ దేవుడు
వరమును తప్పక అందిస్తాడు
వరమును అందిన మనమంతా
చేరుతాములే ఆ దేవుని చెంత. !
మనం స్వర్గసుఖాలను అప్పుడు
అనుభవిస్తాము ఇక ఎల్లప్పుడు
ఈ శుభ తరుణాన్ని చేసుకో అర్థం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి