"భావితరాల అంతరంగం - భారత రాజ్యాంగం":-కుదమ తిరుమలరావు, 9505665748
 తరతరాల తిమిరాన్ని తరిమిన - మనిషిని మనిషిగా గౌరవించిన
ప్రజలచేతికధికారమిచ్చిన- స్వాతంత్ర్య ఫలాలందజేసిన
అదియే భారతరాజ్యాంగం - భావితరాల అంతరంగం
ఇలలో పెద్ద లిఖిత గ్రంథం - సంక్షేమాన్ని గాంచు మంత్రం
ప్రభుత్వమనేది దేహం ఐతే - రాజ్యాంగమనేది ఆత్మవంటిది
పాలనకిది నియమావళి కాగా - దిశ నిర్దేశాలను పల్కెను నాంది
అదియే అత్యున్నత చట్టం - జగతికి మార్గదర్శకత్వం
బాధ్యత తెలిపే దిక్సూచి - మనదగు దృడమగు రాజ్యాంగం
విలువలకు ఇది అంకురార్పణ - న్యాయ వ్యవస్థను తీర్చిదిద్దిన
ఆదేశిక సూత్రాలు హక్కులై - బానిస బ్రతుకును రూపుమాపిన
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - డ్రాఫ్టింగ్ కమిటీ ఛైర్మన్ గా
వెలసిన భారత రాజ్యాంగం - సమన్యాయానికి చిహ్నంగా
డాక్టర్ బాబు రాజేంద్రుని - అధ్యక్షతన ఉద్భవించిన
ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యమై - ఆదర్శపు శాసనమై నిలిచిన
భారత రాజ్యాంగం వేదం - నవతకు సమత మమత వేదం
నీతిని ప్రబోధించు శాస్త్రం - పూజించేటి భారతీయం
-----

-కుదమ తిరుమలరావు, , 
సాంఘిక శాస్త్రోపాధ్యాయులు,
కడుము పాతపొన్నుటూరు,
శ్రీకాకుళం జిల్లా.
9505665748

కామెంట్‌లు