సర్వేల్లో సక్సెస్ రేటెంత?!::- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
కులమత సర్వేలు కాదు 
చేయవలసినది

విభిన్న కులాల మతాల ఆర్థిక సర్వే చేయాలి

ఆధునిక కాలంలో
డబ్బే ప్రధానమైనది

సామాజిక హోదా
సంఘీభావం
సార్వజనీన భావన
ఇవన్నీ
ఆర్థిక అంశాల చుట్టూతే
పరిభ్రమిస్తుంటే

ఇప్పుడు శాస్త్రసాంకేతిక రంగాల్లో
అనూహ్యమైన ప్రగతి సాధించామని
ఇదే మానవాభివృద్ధి సూచీ
అనే మనం

ఆర్థిక అంతరాలు దూరం చేయాలనే
ఈ చిన్న లాజిక్ ఎందుకు మరిచాము

విజ్ఞులు ఆలోచించాలి

ఈ సర్వేలన్నీ గతంలో బుట్టదాఖలైనవనే
అపవాదు ఉండనే ఉంది

సంక్షేమం కాకుండా
ఉపాధి ఉద్యోగాలు చూపే
వ్యవస్థ ఏర్పాటు చేసేలా
ఈ సర్వే ఒక మార్గసూచీ
అయితే
సమాఖ్య స్ఫూర్తికి ఈ సర్వే ప్రతిబింబంగా నిలుస్తుంది

లేకుంటే 
గత సర్వేఫలాలే
పునరావృతమవుతాయి

అంతా మన మంచికే 
అని
భావించి ముందడుగేద్దాం


కామెంట్‌లు