కవి అంటే ఎవరు?!:- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
కవి అంటే ఎవరు?!
అతనెక్కడుంటాడు?!

కవి అంటే మనలో ఒకడు
మనబాధల్నీ గాథల్నీ
మన వెనుకబాటుతనాన్ని
పాటగా మాటగా
కథగా ,కవితగా ఆవిష్కరించేటోడు
మార్పు దిశగా మనల్నినడిపేవాడు

కవి అంటే ఎవరు?!
అతను మానవతావాది, సమ్యవాది 
ఎంతో మనోవేదన అనుభవిస్తే తప్పా
ఉత్తమోత్తమమైన కవితవ్రాయలేడు

కవి అంటే ఎవరు?!
అతనో ప్రకృతి ప్రేమికుడు
కొండ కోనలు నదీనదాలు
ఏపుగా పెరిగిన చెట్లు
ఎగసిపడే జలపాతాలు
పక్షుల కిలకిలరావాలు
ఆకాశంలోన ఉరుములు మెరుపులు
హోరుగాలి 
జోరువాన
ఈ దృశ్యమిచ్చెగదా
అతనికో ఇతివృత్తం

కవి అంటే ఎవరు?!
అతనో దయార్ద్ర హృదయుడు
కడుపేదలు కష్టజీవులు
అనాథలు అభాగ్యులు
అనారోగ్యం అవిద్య
మురికివాడల్లో నివాసం
చూసి స్పందించి
సామాజిక 
చైతన్య గీతమౌతాడు

కవి అంటే ఎవరు
అతనెక్కడుంటాడు
ఎక్కడైతే పౌరహక్కులు
కాలరాయబడతాయో
అక్కడహక్కుల నేతవుతాడు
ఎక్కడ బానిసత్వంవ్రేళ్ళూనుకొని ఉంటుందో
అక్కడ సమరశంఖమూదుతాడు
పోరాడితే పోవునేమి
బానిస సంకెళ్లు తప్పా
అంటూ
జననినాదమై గర్జిస్తాడు
విజయధ్వజమై 
వినీలాకాశంలో ఎగురుతాడు



కామెంట్‌లు