పల్లవి:
బిడ్డల ఆరోగ్యానికి అమ్మ పాలె అమృతం
ముద్దులొలుకు పాపలకు ముర్రుపాలె ఔషధం
చరణం 1
చనుబాలను పట్టండి తల్లులారా
డబ్బా పాలు వద్దు అమ్మలారా
బిడ్డలకు వ్యాధులతో పోరాడే శక్తినిచ్చును చనుబాలు అమ్మలారా
/బిడ్డల/
చరణం 2
పాలిచ్చు తల్లులకు రొమ్ము క్యాన్సరు రాదు
షుగరు వ్యాధి రానే రాదు అమ్మలారా
గుండె జబ్బుబీపీలు మచ్చుకైన కానరావు
తల్లిపాలలో ABCDK విటమిన్లు ఉన్నాయి
ఈ తల్లిపాలలోనే చక్కరప్రోటీన్లు సమృద్దిగా ఉన్నాయి
/బిడ్డల/
చరణం 3
పుట్టిన ప్రతి బిడ్డకుతల్లులు రెండేళ్ల వయస్సు వచ్చువరకు
తల్లిపాలు పడితే తల్లులారా
తల్లి బిడ్డ ఆరోగ్యం అమ్మలారా
/బిడ్డల/
చరణం 4
ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు
తల్లిపాల గొప్పదనం తెలుపుదాం...
పసిపిల్లల తల్లులను గర్భవతులను చైతన్యం చేద్దాం
రేపటి తరమును కాపాడుకుందాం
/బిడ్డల/
(ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా వ్రాయడం జరిగింది ఈ గేయం)
(WHO, UNICEF వారి సహకారంతో
World alliance for breast feeding action -WABA) గత 26 ఏళ్లుగా తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తుంది
తల్లిపాల విశిష్టతను తల్లులకు తెలియజేసి పిల్లలను ఆరోగ్యవంతంగా పెంచుకోవాలని ప్రభుత్వం ప్రచారం చేస్తుంది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి