కవులు కవి సమయాలు - కవిత్వం సమాజ దశదిశ:- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
 కవి హృదయావిష్కరణే
కవిత్వమా?!
కవివాగాడంభాచరమే
కవిత్వమా
కాదు కాదు
సామాజిక రుగ్మతలను
రూపుమాపే
ఔషధీ గుణముల
సమాహారమే కవిత్వం
కవిత ఎప్పుడూ పుడుతుంది
అంటే ఏంచెబుతాం
అసమానతలు
అన్యాయాలు
పీడితులు
తాడితులు
దోపిడీ కోరుల శ్రమదోపిడి
అన్నార్తుల ఆకలి కేకలు
దగాపడ్డ అమాయకత్వం
నిర్భాగ్యుల దైన్యం
కవి సమయాలు గా మారి
హృదయం ద్రవీభవించి
సామాజిక చైతన్య గీతమై
కవిత పొలికేక పెడుతుంది
ఉప్పెనై ఉవ్వెత్తున ఎగసిపడుతుంది
కాళ్ళు చేతులు లేని వాడికి
చేయూతై నిలుస్తుంది
మూగవాడికి గొంతుకవుతుంది
కవిత్వం ఎగుడు దిగుడు సమాజాన్ని సమతలం చేస్తుంది
కవికి జరిగే సన్మానాలు సత్కారాలు
దళసరి కాగితం ముక్క
చెక్క ముక్కలు కాదు
తన కవితను సామాజిక కోణం లో నచ్చిమెచ్చి
కవికి గల సామాజిక చైతన్యాన్ని వేనోళ్ళ పొగడడం
తలపండిన కవులు వర్థమాన కవులను భుజం తట్టి
ప్రోత్సాహించడం
ఇతివృత్తం ఎంపిక సామాజికమా
సనాతనమా
శిల్ప నిర్మాణం
పొయెటిక్ ఎక్స్ప్రెషన్
ఇవన్నీంటిపై సమీక్ష జరిపి
కవుల కవితలను చిత్రిక పట్టడం
విశ్వకళ్యాణానికై
కవి శ్రేష్ఠులు అహరహం పరితపించడం
సాహితీ మాగాణాన్ని
బంగారు మయం చేయడం

కామెంట్‌లు