సంప్రదాయ వ్యవసాయాన్ని కాపాడుకుందాం:- అంకాల సోమయ్య-దేవరుప్పుల- జనగాం-9640748497
పంట పొలాల్లో 
పనిపాటలు చేస్తూ సురసుమండే ఎండలు అంబటాళ్ళకాడ ఆకలిగొన్న  రైతు కూలీలకు
 కారం మెతుకులే పరమాన్నం

శ్రమజీవన సౌందర్యం వారి జీవనసౌభాగ్యం

దేశానికి అన్న పెట్టి ఆకలి తీర్చడమే ఆరైతన్నల ఏకైక లక్ష్యం

కల్లాకపటం తెలియనివారు
కన్నతల్లి లాంటి భూతల్లినే నమ్ముకున్న భూమిపుత్రులు

వర్షాకాలంలో తుఫాన్లు వరదలకు పంటనీటమునిగినా
కన్నీరుమున్నీరుగా విలపించినా
వ్యవసాయం వదలని నిఖార్సైన కర్మవీరులు

నేడు కార్పోరేట్ కంపెనీలు  వ్యవసాయంలో పాదంమోపడంతో సంప్రదాయ వ్యవసాయం కుదేలై
పంటపపొలాలను కారుచౌకగా తెగనమ్ముకొని పట్టణాల్లో అడ్డమీది కూలీలైన అన్నదాతలు

సంప్రదాయ వ్యవసాయం అమృతాహారమందిస్తుదని
 గొంతు చించుకొనిఅరిచిన
 వినే స్థితిలోలేని వినియోగదారులు
 
కార్పోరేట్ సంస్థలు మాయా మోసపు ప్రకటనలతో పచ్చళ్ళు నుండి పప్పు బియ్యం వరకు అన్నింటిని 
రెడీ మేడ్ గా వంటకు సిద్దం చేసి ఫుడ్ కోర్ట్ లు
రిలయన్స్ ఫ్రెష్ ల్లో విక్రయిస్తుంటే

పాలీహౌస్ ఫామ్స్ తో పండ్లు కూరగాయలు పంటలు
 కార్పోరేట్స్ గుత్తాధిపత్యం గా పండించి 
సకలజనావళికి ఆన్లైన్ లో, విపణి వీధిలో
 స్టాల్స్ ఏర్పాటు చేసి అమ్మకం చేస్తుంటే 

సంప్రదాయ వ్యవసాయమే ప్రధాన వృత్తిగా బ్రతికే రైతన్నల  నడ్డివిరిచారు

గ్రామసీమల్లోకొద్దొగొప్పోఉన్న
రైతులు వ్యవసాయంలాభసాటిగా లేదని
క్రాప్ హాలిడే ప్రకటించారు

ఎద్దు ఏడ్చిన ఎవుసం
రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నటికీ బాగుపడదు

చిన్న సన్నకారు రైతులు యాంత్రిక వ్యవసాయంతో, 
విత్తనాలు రసాయనిక ఎరువుల కొనుగోలుతో 
రైతుకు పెట్టుబడి వ్యయం పెరిగి మున్ముందు
 వ్యవసాయమే కనుమరుగైతే...!?
 రైతును మ్యూజియంలో చూడవలసి వస్తుంది.


కామెంట్‌లు