కొడిగట్టేదీపంనేను :- అంకాల సోమయ్య-దేవరుప్పుల- జనగాం -9640748497
 పల్లవి:
ఏమియ్యగలను 2పాపా ..
చిట్టిపాపా2
ప్రొద్దువాలే వయసునాది
కొడిగట్టేదీపంనేను
పొడిచేటి ప్రొద్దు నువ్వు
వెలుగులీను కాంతినువ్వూ2
చరణం 1 
ఎవరూ లేని అనాథవూ నువ్వు 
నాకందరున్నా ఒంటరిని నేనూ
ఏడ్వొద్దుపాపా
ఆదేవుడు పంపిన  నేస్తమా2
చరణం 2 
వయసుందని ధనముందని
విర్రవీగే నేటితరం
అయినవారిని వదిలి
అందనంత దూరమేగే స్వార్థం 2
చరణం 3 
పసితనం ముదిమి వయస్సు
ఒకటే ఒకటే2
నీకు నేను నాకు నువ్వు
తోడు నీడగుందాము
చరణం 4
రావమ్మా పాపా
ఆటలాడి పాటపాడి
ఆనందంగుందాము
బ్రతుకు ప్రొద్దువాలేదాకా2


కామెంట్‌లు