ఆటలు:-కొమురవెల్లి అంజయ్య-సిద్దిపేట-సెల్..9848005676
ఆడరండి ఆటలు
అందరు మెచ్చే రీతులు
పెరుగుతాయి కదలికలు
ఆరోగ్యమౌ శరీరాలు 

బాల్యదశపు ఆటలు
నేర్పుతాయి కిటుకులు
పెంచుతాయి దృఢత్వాలు
పెరుగును ఏకాగ్రతలు 

గోటీలు, తాడాటలు
చిర్రగోనె, బంతాటలు
పరుగులు, దాగుడుమూతలు
ఒంటి కాలి గెంతడాలు 

చెస్, క్యారమ్స్, లూడోలు
పచ్చీసు, పులి మేకలు
వైకుంఠపాళి, గవ్వలు
ఆటలన్నీ వేర్వేరులు 

కబడ్డీ ఆటల్లో
ముట్టుకోండి ప్రత్యర్థులు
బాతదాటితే చేతులు
దుమ్ము రేపు గెలుపులు 

క్రికెట్, వాలీబాలులు
ఫుట్బాల్, బాస్కెట్ బాల్ లు
ఏవైతేనేం ఆటలు
నేర్పుతాయి మెలకువలు 

ఆటలతో మనసులు
బాగుంటాయి తలపులు
తీర్చుకోండి అలసటలు
దీర్ఘ శ్వాస కదలికలు

వీడియో గేమ్ బానిసలు
కావద్దులే పిల్లలు, పెద్దలు
ఆటలు చిందితే చెమటలు
ఆరోగ్య సర్వాంగాలు
.................................................


కామెంట్‌లు