బామ్మ సూక్తులు:--గద్వాల సోమన్న,9966414580
అతిగా వాగే నోరు
తెచ్చిపెట్టును చిక్కులు
సరిగా లేని తీరు
పాడుచేయును బ్రతుకులు

ఇంటిలో సదా పోరు
నలగగొట్టును మనసులు
నానాటికి దిగుజారు
కుటుంబ  పరిస్థితులు

పొదుపు చేయని ఊరు
అభివృద్ధికి కడు దూరము
అసూయ కలిగిన వారు
తమకు తామే భారము

గలగల పారే యేరు
అందరి క్షేమం కోరు
చేతలు లేని మనుషులు
వట్టి సంద్రపు హోరు


కామెంట్‌లు