బాలల కాంక్ష:--గద్వాల సోమన్న,9966414580
తెలుగు పాట పాడుతాం
వెలుగు బాట సాగుతాం
కలసిమెలసి మేమంతా
చెలిమి విలువ చాటుతాం

మాట మీద నిలబడుతాం
తోటలాగ కనబడుతాం
కోటలో యువ రాజులై
మేటిగా జీవిస్తాం!

హరివిల్లై ఉదయిస్తాం
విరిజల్లై కురుస్తాం
సిరిమల్లె పువ్వుల్లా
చిరునవ్వులు చిందిస్తాం

కోతలన్నీ మానుతాం
చేతల్లో చూపిస్తాం
పొరుగు వారికి సాయపడి
పరువు కల్గి బ్రతుతాం


కామెంట్‌లు