ఉంటే చాలు:- -గద్వాల సోమన్న,-9966414580
పుడమిలోని తరువులు
ఇంటిలోని బాలలు
ఎంతెంతో అందము
కొలనులోని కలువలు

చెరువులోని జలములు
చెట్టు మీద ఫలములు
ఉపయోగము చాలా
చేనులోని పైరులు

ముఖంలోని నగవులు
కాంతులీను ప్రమిదలు
తెచ్చిపెట్టు అందము
గృహంలోని వనితలు

తనువుపైన విలువలు
జీవితాన విలువలు
ఉంటేనే  గౌరవము
మాట మీద మనుజులు

ప్రేమలొలుకు మనసులు
ఆపదలో మిత్రులు
ఉండాలోయ్! తప్పక
గుండెల్లో  ప్రేమలు

వయసులోన పెద్దలు
అనుభవజ్ఞులు వృద్ధులు
సమాజానికి మేలు
మహిని ఉంటే చాలు


కామెంట్‌లు