బాల్యం : -గద్వాల సోమన్న,-9966414580
స్వచ్ఛమైన కాగితము
చిన్నారుల జీవితము
చేయకూడదు మలినము
కాకూడదు నాశనము

సృషిలోనే అమూల్యము
దేవుడిచ్చినది బాల్యము
వెట్టిచాకిరిలోనికి
నెట్టి చేయెద్దు పతనము

బాల్యమే బంగారము
జీవితాన సింగారము
తలపించేను స్వర్గము
ఉండును రక్షణ కవచము

విరజిమ్మే ఊటలా
ప్రవహించు ఆనందము
బాల్య జీవితమే
గమనిస్తే ఉషోదయము

బాల్యానికి లేవు లేవు
కులాల కుమ్ములాటలు
లేశమైనా తెలియవు
మతాల మరణహోమాలు

స్వేచ్చకు ఆలవాలము
పవిత్రమైన బాల్యము
భగవంతుని బహుమానము
జీవితంలో భాగ్యము


కామెంట్‌లు