"రేపటి భారత పౌరులు":--గద్వాల సోమన్న,-9966414580
పిల్లల మనసులు శుద్ధము
చేయకు ఎన్నడు మలినము
చిగురాకులా సున్నితము
రేపరాదోయి! గాయము

కల్మషం లేని పిల్లలు
కరుణకు వారు వారథులు
కుళ్లు, కుతంత్రాలు లేని
కరుణామృత చిరుజల్లులు

అభంశుభమెరగని వారు
వారికెవరు సాటి  లేరు
దైవానికి ప్రతినిధులు
దానవులు కానే కారు

సదన గగనాన సూర్యులు
చల్లని మనసుల చంద్రులు
మిలమిలలాడే తారలు
కిలకిల నవ్వే కూనలు

పువ్వుల్లాంటి బాలలు
దివ్వెల్లోని వెలుగులు
"రేపటి భారత పౌరులు"
భారతి ముద్దు బిడ్డలు


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Excellent sir,🙏🙏🙏
అజ్ఞాత చెప్పారు…
Excellent sir 👌👌👌,,,,🙏🙏🙏