దిద్దుబాటు మేలు.- :--గద్వాల సోమన్న,9966414580
చెట్టుకు పట్టిన చెదల్లా
చెడ్డ గుణం చెరుపుతుంది
పచ్చని జీవితాల్లో
చిచ్చుపెట్టి తీరుతుంది

రాతిలాంటి కాఠిన్యము
నడతను దెబ్బతీస్తుంది
కుటుంబాన అలజడి రేపి
మనసుకు గాయం చేస్తుంది

వ్యసనాలు మ్రానులైతే
బ్రతుకులను దెబ్బతీయును
తొలుత త్రుంచకపోతే
దారిద్య్రం దాపురించును

ఆదిలో దిద్దుకుంటే 
అగునోయి మణిదీపాలు
అందరికీ ఆదర్శము
సార్థకమగు జీవితాలు


కామెంట్‌లు