ఆసక్తికరంగా అంతర్జాతీయ అంతర్జాల కాలిఫోర్నియా వీక్షణ సమావేశం:-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
  కాలిఫోర్నియా తెలుగు సంఘం వారి 147వ వీక్షణం అంతర్జాల సమావేశం శనివారం ఆసక్తికరంగా జరిగింది. మొదట వీక్షణం అధ్యక్షురాలు, కవి, గాయని శ్రీమతి గీతా మాధవి గారు ముఖ్య అతిధి, సహస్ర సినీటీవి గేయాల రచయిత శ్రీ మౌనశ్రీ మల్లిక్ ను మరియు హాజరయిన కవులకు స్వాగతం పలికారు. తర్వాత శ్రీ మౌనశ్రీ మల్లిక్ సినిమా గేయ రచయితలకు ఉండవలసిన లక్షణాలు మరియు పాటించవలసిన నియమాలను చక్కగా సోదాహరణంగా స్వీయానుభవాలతో వివరించారు. మౌనశ్రీ ప్రసంగం చాలా బాగున్నదని శ్రీమతి గీతా మాధవి, సినీ గేయ రచయిత శ్రీ సాదనాల వేంకటేశ్వరరావు, ప్రముఖ కవి శ్రీ రామాయణం ప్రసాదరావు మరియు వీక్షణం భారతదేశ ప్రతినిధి శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ స్పందించి మౌనశ్రీ గారికి ధన్యవాదాలు మరియు అభినందనలు తెలిపారు.
పిమ్మట శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ కవిసమ్మేళనం నిర్వహించారు.
శ్రీ మేడిశెట్టి యోగేశ్వరరావు కుండపోత అనే తన కవితను పాడి వినిపించారు.అవధానం  అమృతవల్లి మనసంటే అనే పాటను,శ్రీ చౌడూరి నరసింహారావుగారు ఒక దేశభక్తి గీతాన్ని పాడి వినిపించారు. శ్రీవాకాటి రాంరెడ్డి వీక్షణం నిర్వాహకులు మరియు హాజరయిన కవులను ప్రస్తావిస్తూ వారు రచించిన పాట ఆసక్తిదాయకంగా ఉన్నది. మండ వీరాస్వామిగౌడ్ ఇంటింటా దేవతలు అనే పాటను, ఊటుకూరి మహేష్  కార్తీకమాసం పై పాటనూ,డాక్టర్ రాధశ్రీ మనజాతి తెలుగు అంటూ,  శ్రీ సాధనాల గోదావరిపై ఒక పాటనూ పాడి సభికులను ఆనంద పరిచారు. మునిమడుగు నాగరాజ శాస్త్రి మూడు తేటగీతి పద్యాలను పాడారు.  
శ్రీ ప్రసాదరావు రామాయణం  "నా మనసే నాకు శత్రువు" అనే కవితను వినిపించాను. శ్రీ కేవీయస్ గౌరీపతి శాస్త్రి (వీరవతి ) గారు  శివ విలాసం పాట పాడారు. డా.యం ఎన్ బృంద గారు "రావమ్మా వరలక్ష్మీ " అంటూ  లక్ష్మీదేవిని స్వాగతిస్తూ ఆలపించారు.
చిట్టబత్తిన వీరరాఘవులు గారు "చందా మామా " అంటూ  ఒక జానపద గీతాన్ని ఆలపించారు. ఆదిత్య "స్వాతి చినుకు " కవితను వినిపించారు. ' వద్దురా పెళ్లొద్దురా 'అనే హాస్య గీతాన్ని శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు పాడి నవ్వించారు . చివరిగా గీతమ్మగారు ఒక శోక గీతాన్ని వినిపించి అందరినీ ఆకట్టుకున్నారు.
శ్రీమతి గీతా మాధవి గారి మలిపలుకులతో సభ ముగిసింది.ఈసారి పాతకాపులను ప్రక్కన బెట్టి క్రొత్తవారికి స్థానం కల్పించడం చాలా సంతోషదాయకమైన విషయమని అందరూ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.

కామెంట్‌లు