బాలల పండుగ వచ్చింది
భలే సరదాలు తెచ్చింది
రంగురంగుల ముగ్గులు వేద్దాం
పాఠశాలను అలంకరిద్దాం
గులాబీలను తీసుకువద్దాం
చాచా నెహ్రూ ని పూజిద్దాం
పోటీలన్నటిలో పాల్గొందాం
బహుమతులన్నీ సాధిద్దాం
ఆడి పాడి ఆనందిద్దాం
మిఠాయిలను పంచేద్దాం
శాంతి కపోతాలను ఎగరేద్దాం
ప్రశాంత జీవనం గడిపేద్దాం
ఆకాశమే హద్దుగా పయనిద్దాం
అందరమొకటని చాటుదాం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి