పూలు;- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 మా ఇంటిముందు 
నందివర్ధనాలు గన్నేరులు
మా పెరటిలో 
ఎర్రటి గులాబీలు
తెల్లని మల్లెలు 
పచ్చని బంతి చేమంతులు
మా పక్కింటిలో
విరగబూసిన పారిజాతాలు
మా ఇంటి ముందున్న 
శివాలయంలో
పువ్వుల పరుపులా
ఒత్తుగా రాలిన పున్నాగలు 
అబ్బో! 
ఏమని చెప్పను?
నా పసితనం 
ఒక పూలతోట!!
---------+++++----+------------------------:

కామెంట్‌లు
మీ బాల్యం పూబాలల పరిమళ భరితం.చాలా బాగుంది సర్.